Credit Limit : క్రెడిట్ కార్డు లిమిట్ అంటే ఏంటి..? పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి..?

-

Credit Limit : చాలామంది ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్స్ ని ఉపయోగిస్తున్నారు. క్రెడిట్ కార్డ్ విషయంలో కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. నగదు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఏదైనా కొనుగోలు చేయడం క్రెడిట్ కార్డుతో ఈజీ అవుతుంది. క్రెడిట్ కార్డుల పై మనకు కొంత లిమిట్ అనేది ఇస్తారు. వస్తువులు లేదా ఇతర సేవల చెల్లింపుల కోసం ఆ పరిమితి మేరకు తక్షణ చెల్లింపులు చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు లో కూడా కొన్ని ప్రయోజనాలు నష్టాలతో వస్తాయి. సరిగ్గా ఉపయోగిస్తే కార్డు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. క్రెడిట్ కార్డ్ పరిమితిని కార్డు జారీ చేసే సంస్థ నిర్ణయం తీసుకుంటుంది. ఇక కార్డుపై నిర్ణయించిన లిమిట్ దాకా ఖర్చు చేయొచ్చు. లిమిట్ దాటితే ఆ ఖర్చుని కొన్ని బ్యాంకులు అనుమతించవు.

ఇలా ఖర్చు చేస్తే ఓవర్ లిమిట్ చార్జీలు విధిస్తూ ఉంటాయి. బ్యాంకును బట్టి చార్జీలు అనేవి మారుతూ ఉంటాయి. ఓవర్ లిమిట్ సదుపాయం ఉపయోగించడం వలన క్రెడిట్ స్కోర్ పై నెగిటివ్ ప్రభావం పడుతుంది. దీంతో లోన్ తీసుకునే అవకాశాలు తగ్గిపోతాయి. క్రెడిట్ కార్డు లిమిట్ 50,000 ఉంటే 15,000 వాడితే ఇంకా 35,000 ఉంటాయి. 20 రోజులు వరకు బిల్లు చెల్లించడానికి గడువుంటుంది. గడువులోగా 35 వేల పరిమితిలోనే ఉంటారు బిల్లును పూర్తిగా చెల్లించిన తర్వాత మాత్రమే 50,000 లిమిట్ ని పొందవచ్చు. ప్రతి నెల కార్డు పై చేసే ఖర్చులు పెరుగుతున్నప్పుడు కూడా లిమిట్ పెంచమని బ్యాంకు ని కార్డుదారుడు కోరవచ్చు.

జీతం పెరిగితే దాని ప్రూఫ్స్ ఇచ్చి లిమిట్ పెంచమని అడగొచ్చు. ఇతర ఆదాయ మార్గాలు ఉన్నా కూడా వాటిని చూపించి లిమిట్ ని పెంచుకోవచ్చు. క్రెడిట్ కార్డు తో పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినప్పుడు దానిని ఒకేసారి తీర్చలేము అనుకుంటే ఈఎంఐ గా మార్చుకోవచ్చు దీనినే ఫ్లెక్సీ పే అంటారు. అర్హతలు ఉండి అదనపు లిమిట్ కావాలంటే ఓ క్రెడిట్ కార్డు తోనే ఆగిపోకర్లేదు. ఇంకో కార్డు ప్రొవైడర్ ని సంప్రదించి ఇంకొక క్రెడిట్ కార్డు ని కూడా తీసుకోవచ్చు. లిమిట్ ఉంది కదా అని క్రెడిట్ కార్డు ని ఎక్కువగా వాడకండి. కార్డ్ హోల్డర్ పరిమితిలోపు ట్రాన్సాక్షన్స్ జరపడం మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version