పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన ఎమ్మెల్యే జ్యోతుల

-

గత వారం రోజుల నుంచి తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. జగ్గంపేటలో నూతన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో తాను వివాదస్పద వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే.కొంతమంది మీరు పార్టీ మారిపోతున్నారు అని వార్తలు వస్తున్నాయని నన్ను అడుగుతున్నారని.. పార్టీ మారవలసిన అవసరం నాకేం లేదని స్పష్టం చేశారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను, నేను పాతిక వేల ఓట్ల మెజారిటీతో నెగ్గిన ఎమ్మెల్యేనని అన్నారు.ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని ప్రతిపక్ష నాయకుల కోసం ఆ విధంగా నేను మాట్లాడానని అన్నారు. నేను ప్రతిపక్షాల గురించి మాట్లాడితే దాన్ని వక్రీకరించి అలాగా ,ఇలాగా అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రకరకాల వ్యక్తులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని వాళ్ళు ఈ విధంగా ప్రచారం చేస్తుంటారన్నారు. నేను అలా అనటం మాత్రం వాస్తవమే, నేను మాట్లాడిన విషయం పూర్తిగా అందరికీ అర్థమయ్యేలా మాట్లాడలేకపోయానన్నారు.

నేను అంత తెలివైన వాడిని కాదు నాకు అంత అనుభవమే ఉంటే నేను వక్రీకరించే మాట్లాడేవాణ్ణి అని అన్నారు. అలా కాకుండా స్ట్రెయిట్ గా మాట్లాడేశానన్నారు. రాజకీయ ఫ్లాట్ ఫారం కోసం ఒకడు, ఏ పార్టీలో పోటీ చేస్తే బాగుంటుందని ఇంకొకడు చూస్తున్నారని ఎద్దేవా చేశారు.నన్నెవరూ బద్నామ్ చేయలేరు, నేను ప్రజల మనిషిని, ప్రజల్లోనే తిరిగే మనిషిని… నేను పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version