రాజోలు నియోజకవర్గంలో విబేధాలు వీగిపోయాయి. వైసీపీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఇద్దరి మధ్య విబేధాలు తొలగిపోయాయి. నిన్నటివరకు గొల్లపల్లిని విభేదించిన రాపాక ఈ రోజు స్వయంగా తనకు తానే గొల్లపల్లి ఇంటికీ వచ్చి గొల్లపల్లి కి సంఘీభావం తెలిపారు రాపాక.

ఇక్కడి నుండి ఇద్దరం కలిసి పనిచేద్దామని గొల్లపల్లికి కౌగిలించుకున్నారు రాపాక. గొల్లపల్లి గెలుపు కోసం ఈ రోజు నుంచి కృషి చేస్తానని కార్యకర్తలు అందరి ముందు ప్రకటించారు ఎమ్మెల్యే రాపాక. దీంతో రాజోలు నియోజకవర్గంలో విబేధాలు వీగిపోయాయి.