వైసీపీకి బిగ్ షాక్.. ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఏపీలో కూటమి సర్కార్ ఏర్పాటు అయిన తర్వాత… వైసీపీ పార్టీకి కష్టాలు తప్పడం లేదు. వైసీపీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఇప్పటికే వైసీపీకి నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా.. తాజాగా రాజశేఖర్ కూడా రిజైన్ చేశారు.

నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడంతో వైసీపీ శ్రేణులు నిస్తేజంగా మారిపోతున్నాయి. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ… రాజశేఖర్ రాజీనామా చేయడం కీలకంగా మారింది. మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్… జనసేన వైపు చూస్తున్నట్లు సమాచారం అందుతోంది.