నేడు మరోసారి సీబీఐ విచారణకు ఎంపీ అవినాశ్‌రెడ్డి

-

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే పలుమార్లు సీబీఐ నోటీసులు అందుకున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి ఇవాళ మరోసారి సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. సీఆర్పీసీ 160 కింద అవినాష్​కు నిన్న నోటీసులు జారీ అయ్యాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. 20 రోజుల తర్వాత మరోసారి ఇవాళ అవినాష్ సీబీఐ ఎదుటకు వెళ్లనున్నారు.

మరోవైపు అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్‌పై గత నెల 25వ తేదీన సీబీఐ వేసిన కౌంటర్‌ అఫిడవిట్‌లో పలు అభియోగాలను, ఆధారాలను.. సీబీఐ వెల్లడించింది. అరెస్ట్‌ చేయకుండా కొన్నిరోజులు ఆపాలని అవినాష్‌రెడ్డి న్యాయవాదులు అభ్యర్థించినా.. సుప్రీం కోర్టు తీర్పు దృష్ట్యా అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయినప్పటికీ 20 రోజుల పాటు సీబీఐ అధికారులు అవినాష్‌రెడ్డి జోలికి వెళ్లకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version