మహానాడు పేరుతో రాజమండ్రిని నాశనం చేస్తున్నారని ఆగ్రహించారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. రాజమండ్రిని సర్వం సుందరంగా తీర్చిదిద్దితే టిడిపి నాయకులు మహానాడు పేరుతో నాశనం చేస్తున్నారు.. రోడ్డంతా కన్నాలు పెడుతున్నారని నిప్పులు చెరిగారు. ఈ విషయంపై వీడియో ప్రదర్శించి చూపిన ఎంపి భరత్… రాజమండ్రికి 15 కిలోమీటర్ల దూరంలో మహానాడు కార్యక్రమం చేస్తున్నారని… మరి ఊర్లో హడావుడి ఎందుకు అని నిలదీశారు.
దండి మార్చ్ విగ్రహాల చుట్టూ టిడిపి జెండాలు కట్టించారు.. టిడిపి నాయకులు ఎంత కండకవరం ఉంటే ఇవన్నీ చేస్తారని ఫైర్ అయ్యారు. వెన్నుపోట్లు పొడవడం ఎందుకు ….శత జయంతి ఉత్సవాలు చేయడం ఎందుకు…అని ప్రశ్నించారు. రాజమండ్రి పుష్కరాల్లో 29 మందిని పొట్టన పెట్టుకున్న నాయకుడు చంద్రబాబు కాదా….సోమయాజులు కమిషన్ భక్తులు, మీడియా అత్యూఉత్సాహం అని తేల్చడం దారుణం అని ఫైర్ అయ్యారు. పుష్కరాల ఘటనలో మృతి చెందిన 29 కుటుంబాలను ఏనాడైనా మీరు గాని మీ కుమారుడిగాని పరామర్శించారా….చంద్రబాబు కు నైతికత ఉందా అని నిలదీశారు. విశాలమైన గ్రౌండ్ లో పబ్లిసిటీ కోసం హడావుడి చేయకండి పుష్కరాల్లో ఘటన జరిగితే దానికి టిడిపి నేతలే బాధ్యత వహించాలని కోరారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్.