చిరంజీవి గారు.. మొదలుపెట్టిందే మీ తమ్ముడు – నందిగం సురేష్

-

వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల వేడుకలలో మెగాస్టార్ చిరంజీవి వైసీపీ ప్రభుత్వ విధానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అధికార వైసీపీని బలంగా తాకాయి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడ్డారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం పై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం.. సినిమా కలెక్షన్లపై దృష్టి పెట్టిందన్నారు.

డిమాండ్ ఉన్నవారికి పారితోషికం ఎక్కువే ఇస్తారని కూడా అన్నారు. దీంతో చిరంజీవి వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎదురు దాడికి దిగారు. చిరంజీవి వ్యాఖ్యలపై తాజాగా వైసిపి ఎంపీ నందిగం సురేష్ స్పందించారు. అయ్యా చిరంజీవి గారు.. అసలు మొదలుపెట్టిందే మీ తమ్ముడు అని అన్నారు. బురద రాజకీయాలు చేయొద్దని అతడికి చెప్పాలని సూచించారు. ప్రత్యేక హోదా తీసుకురావడం ఎలాగో మేము చూసుకుంటామని.. మీ పని మీరు చూసుకోవాలని హితవు పలికారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version