పిఠాపురంలో పవన్ కచ్చితంగా ఓడిపోతాడు – ముద్రగడ సంచలనం

-

ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ కచ్చితంగా ఓడిపోతాడన్నారు ముద్రగడ పద్మనాభం. ఒక ఎంపీ, ఎమ్మెల్యే లేకుండా పార్టీ పెడితే నేను అతని దగ్గరికి వెళ్లాలా.. చిరంజీవి ఓడిపోయాడు.. పవన్ రెండు చోట్ల ఓడిపోయాడని గుర్తు చేశారు.

mudragada padmanabham letter to pawan kalyan

ఉద్యమం వలన నేను నష్టపోయాను.. నా శత్రవులతో పవన్ కళ్యాణ్ ఎలా కలుస్తాడని ఫైర్‌ అయ్యారు ముద్రగడ పద్మనాభం. గత ప్రభుత్వంలో పవన్ ఐదేళ్లు ఏ మడుగులో ఉన్నాడు..? నా శత్రువులతో పవన్ ఎలా కలుస్తాడు. వైసీపీలో చేరకుండా ఉండుంటే పవన్ కళ్యాణ్ పై పీఠాపురంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేవాడిని. పిఠాపురంలో పవన్ కచ్చితంగా ఓడిపోతాడు అని ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. సినిమా వాళ్లు రాజకీయాలకు పనికి రారు అని ముద్రగడ పద్మనాభం తెలిపారు. ప్రత్తిపాడు నుంచి కాపుల కోసం పని చేయడంతో నా రాజకీయ పతనం ప్రారంభమైంది అని తెలిపారు ముద్రగడ పద్మనాభం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version