ఏపీని వర్క్ ఫ్రం హోమ్ హబ్ గా చేయాలనేది నా లక్ష్యం : సీఎం చంద్రబాబు

-

ఏపీని వర్క్ ఫ్రం హోమ్ హబ్ గా చేయాలనేది నా లక్ష్యం అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు  దావోస్ వెళ్లిన ఆయన జ్యూరిచ్ లో అక్కడి పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. అన్ని దేశాలలో తెలుగు వాళ్ల పుట్ ప్రింట్ ఉంటుందని.. అదే మన గొప్పతనం అన్నారు. తెలుగు వాళ్లు ఎక్కడైనా గొప్పగా పని చేస్తారు.. రాణిస్తారు. పట్టుదల చాలా ఎక్కువ. నైపుణ్యాలు పెంచుకుంటారని తెలిపారు.

సంపద సృష్టించడం కష్టం కాదు.. 2047 నాటికి తెలుగువాళ్లు గొప్పగా ఉండాలనేదే నా లక్ష్యం. తెలుగు వాళ్లకు ప్రత్యేక గుర్తింపు రావాలి. తెలుగు వాళ్లు అనేక కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చారు. ఉక్రెయిన్ లో సమస్య వచ్చినప్పుడు ప్రవాసాంధ్రులు బాగా పని చేశారు. ఎక్కడికి వెళ్లినా మీరు మూలాలు మరిచిపోకూడదని సూచించారు. నిరంతర శ్రమ వల్లనే తెలుగు వాళ్లు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ వేగంగా పెరుగుతోంది. ఏపీని వర్క్ ఫ్రం హోమ్ హబ్ గా చేయాలనేది నా లక్ష్యం అని.. మ్యాన్ పవర్ కు ఫిజికల్ లేదా వర్చువల్ గా నియమించుకోవాలి. ప్రతీ ఒక్కరూ ఏఐ, చాట్ జీపీటీ నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు చంద్రబాబు. 

Read more RELATED
Recommended to you

Latest news