అన్ని మతాల వారిని తాను గౌరవిస్తానని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ముస్లింలను మైనార్టీలు అంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది అన్నారు. మైనార్టీలు నా గుండెల్లో ఎప్పుడూ మెజార్టీలే అన్నారు. క్రిస్టియన్లను ఎప్పుడూ ఓట్లు అడగలేదు. మనస్ఫూర్తిగా గౌరవించాను. నా భార్య కూడా క్రిస్టియనే. కానీ దానిని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడలేదు. అన్ని మతాలు నాకు సమానమే అని చెబుతున్నాను. ఈ ఎన్నికల్లో పొత్తు గెలుస్తుంది అని వివరించారు.
గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి ఓడిన పవన్.. ఈసారి పీఠాపురం నుంచి బరిలో దిగనున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా కాపుల ఓట్లు అక్కడ 91వేలకు పైగా ఉండటం.. టీడీపీ-బీజేపీ పొత్తు కలిసి వస్తుందని అంచనా వేసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పీఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించడంతో దర్శకుడు ఆర్జీవీ కీలక ప్రకటన చేశారు. తాను కూడా పీఠాపురం నుంచి బరిలో నిలవనున్నట్టు తెలిపారు. ఇది తాను సడెన్ గా తీసుకున్న నిర్ణయం అని ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ.