ఆంధ్రప్రదేశ్ లో తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే మొత్తం 8 స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో తాజాగా జనసేన పార్టీ తరపున నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసినట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నాగబాబుకు రాజ్యసభ సీటు అని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న వార్తకు తెరదించారు.
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే జనసేన తరపున నామినేషన్ దాఖలు చేయాలని.. అందుకు సంబంధించిన పత్రాలను సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ముఖ్యంగా నాగబాబు గత ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు. అప్పటి నుంచి ఆయనకు ఏదో ఒక మంచి పదవీ దక్కుతుందని పార్టీ కార్యకర్తలు ఎదురుచూశారు. ఆ తరువాత లోక్ సభకు పంపిస్తారని అంతా అనుకున్నారు. అప్పట్లో మూడు స్థానాలు ఖాలీ కాగా.. వాటిలో నాగబాబుకు దక్కలేదు. తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యే అవకాశం దక్కింది.