సీఎం రేవంత్‌ను ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ బుధవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వచ్చిన ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షిని ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించి ఆమెకు పూల బొకే అందించారు. అనంతరం శాలువా కప్పి సత్కరించారు.నూలు వడికే చరఖా, మొక్కను బహుమతిగా అందజేశారు.
ఆ సమయంలో సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారు. అనంతరం పార్టీ కార్యక్రమాలు, టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలపై సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు వచ్చే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై, అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగినట్లు సమాచారం.