నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని తగలబెట్టాడు ఓ ప్రేమోన్మాది. ఈ సంఘటన తాజాగా చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. నందికొట్కూరు బైరెడ్డి నగర్ లో లహరి (17) ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు రాఘవేంద్ర అనే యువకుడు.
ఇంటర్ చదువుతున్న లహరి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. రాఘవేంద్ర కొలిమిగుండ్ల నివాసి అని చెబుతున్నారు. అయితే.. లహరి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి..నిప్పు అంటించడంతో… మంటల్లో కాలి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటనతో… నందికొట్కూరు బైరెడ్డి నగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. వెల్దుర్తి మండలం రామళ్లకోటకు చెందిన లహరి… తండ్రి చనిపోవడంతో నందికొట్కూరులో అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటోందట.