ఏపీ ప్రజలకు అలర్ట్. ఏపీకి 17న మరో ముప్పు..రేపటి నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం అలానే కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈనెల 11 నాటికి నైరుతి బంగాళాఖాతానికి చేరుకొని TN-శ్రీలంక మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/11/rains-1.jpg)
దీని ప్రభావంతో రేపటి నుంచి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. ఈ నెల 17న అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.
దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే…. రేపటి నుంచి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేసిన నేపథ్యంలోనే… విద్యాశాఖ కూడా అలర్ట్ అయింది. అవసరం అనుకుంటే.. పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారట.