నందమూరి బాలయ్యకు పద్మభూషణ్ రావడంపై నారా భువనేశ్వరీ స్పందించారు. మా పుట్టింటికి రెండో పద్మం రావడం మా అందరికీ గర్వంగా ఉందన్నారు. బాల అన్నయ్య .. జానపద, సాంఘిక, పౌరాణిక, చారిత్రక, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ వంటి చిత్రాలలో నటించి చిత్ర సీమలో 50 ఏళ్ల నట ప్రస్థానం ఇటీవలే పూర్తి చేసుకొని కళామతల్లిని మెప్పిస్తూనే వున్నాడని తెలిపారు.
మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం అందుకుని తన వంతు బాధ్యతలు నిర్వహిస్తూ.. బసవ తారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్గా కూడా తన సేవలు అందిస్తూ వున్నాడని తెలిపారు నారా భువనేశ్వరి. మా ముద్దుల బాల అన్నయ్య ఇప్పుడు పద్మభూషణ్ బాలకృష్ణ అయిన సందర్భంగా శుభాకాంక్షలు అని చెప్పారు. ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు పేర్కొన్నారు. అలాగే ఈ ఏట పద్మా పురస్కారాలు అందుకొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు చెప్పారు.
మా పుట్టింటికి రెండో పద్మం రావడం మా అందరికీ గర్వంగా ఉంది.
బాల అన్నయ్య .. జానపద, సాంఘిక, పౌరాణిక, చారిత్రక, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ వంటి చిత్రాలలో నటించి చిత్ర సీమలో 50 ఏళ్ల నట ప్రస్థానం ఇటీవలే పూర్తి చేసుకొని కళామతల్లిని మెప్పిస్తూనే వున్నాడు.
మరోవైపు హిందూపురం… pic.twitter.com/D7srXSRHJL
— Nara Bhuvaneswari (@ManagingTrustee) January 25, 2025