గాంధీ జయంతి సందర్భంగా ఇవాళ టీడీపీ నేతలు దీక్ష చేశారు. సాయంత్రం తాజాగా దీక్షను విరమించారు టీడీపీ నేతలు. అనంతరం భువనేశ్వరి మీడియాతో మాట్లాడారు. ఈ దీక్ష ప్రజల కోసమే చేశాను. ఒకప్పుడు చంద్రబాబు గారిని నిలదీశాను. కుటుంబ కోసం సమయం కేటాయించమని.. అయినా ఆయన ప్రజల కోసమే సమయాన్ని కేటాయించారు. మీ అందరూ చూపించే అభిమానం.. ప్రజలకు చంద్రబాబు ఎప్పుడూ సేవ చేయాలనేదే నా కోరిక.
సత్యమేవ జయతే.. అహింస అని నమ్ముతాను. నందమూరి తారకరామారావు ఆ బాధలోనే టీడీపీని ప్రజల కోసం నిర్మించారు. నీతి, నిజాయితీ గల కుటుంబం మాది. చాలా గర్వంగా చెబుతాను. కరెప్షన్ కేసు మా మీద పెట్టలేదు. టీడీపీని ఎన్టీఆర్ ప్రజల కోసం ప్రారంభించారు. నా తండ్రి సీఎం, నా భర్త ముఖ్యమంత్రి.. ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేయలేదు. మా కుటుంబం పై ఒక్క అవినీతి ఆరోపణ కానీ లేదు. ఒక్క కేసు లేదు. మా పని ఏందో మేము చేసుకుంటాం. ప్రజల కోసం తపించే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు.