బంగ్లాదేశ్ ఇంగ్లాండ్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి… నిరాశలో ఫ్యాన్స్ !

-

ఈ రోజు గౌహతి లో ఇంగ్లాండ్ మరియు బంగ్లాదేశ్ ల మధ్యన జరుగుతున్న వరల్డ్ కప్ వార్మ్ అప్ మ్యాచ్ 30 ఓవర్లు వద్ద మ్యాచ్ జరుగుతుండగా వర్షం వలన ఆగిపోయింది. మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది.. అనంతరం ఓపెనర్లుగా వచ్చిన టాంజిద్ మరియు లిటన్ దాస్ లు గత మ్యాచ్ లో ఫామ్ ను చూపించలేకపోయారు.. లిటన్ దాస్ 5 పరుగులకు అవుట్ కాగా, టాంజిద్ మాత్రం 45 పరుగులు చేసి అర్ద సెంచరీ మిస్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శాంటో (2) కూడా ఫెయిల్ అయ్యాడు. ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నా మెహిదీ హాసన్ మిరాజ్ మాత్రం వికెట్ ఇవ్వడకుండా ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతమగా ఎదుర్కొంటున్నాడు. సీనియర్లు మహ్మదుల్లా మరియు ముషఫీకూర్ రహీం లు సైతం వచ్చిన అవకాశాలను వాడుకోవడంలో ఫెయిల్ అయ్యారు. జట్టు స్కోర్ 153 వద్ద ఉండగా 5 వికెట్లు కోల్పోయింది. మరి వర్షం ఏమైనా ఆగితే ఖచ్చితంగా ఓవర్ లను కుదించి మ్యాచ్ ను కొనసాగించే అవకాశం ఉంటుంది.

మరి వరుణుడు అవకాశం వస్తాడా లేదా అన్నది చూడాలి.. కాగా ఇంగ్లాండ్ బౌలర్లలో అదిల్ రశీద్ మరియు టాప్లె రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే వర్షం పట్ల చాలా నిరాశగా ఉన్నారని క్లియర్ గా అర్ధమవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version