BREAKING: నేడు కుప్పంలో నామినేషన్‌ వేయనున్న నారా భువనేశ్వరి

-

నేడు కుప్పంలో చంద్రబాబు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే… చంద్రబాబు తరపున నామినేషన్ దాఖలు చేయనున్నారు నారా భువనేశ్వరి. నేడు మధ్యాహ్నం 01:27 గంటలకు రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు భువనేశ్వరి.

Nara Bhuvaneshwari will file nomination today in Kuppam

నామినేషన్ పత్రాలకు కుప్పంలోని వరదరాజస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న భువనేశ్వరి… నేడు 10 గంటలకు కుప్పం పి.ఈ.ఎస్.మెడికల్ కళాశాలలోని గెస్ట్ హౌస్ నుంచి వరదరాజస్వామి దేవాలయానికి బయలుదేరనున్నారు.

భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు కుప్పం టీడీపీ నేతలు. నామినేషన్ అనంతరం కుప్పం పి.ఈ.ఎస్ మెడికల్ కళాశాల గెస్ట్ హౌస్ వద్ద భోజన విరామం ఉంటుంది. భోజన విరామం అనంతరం కుప్పం పార్టీ కార్యాలయం వద్ద అంతర్గత సమావేశంలో పాల్గొననున్నారు భువనేశ్వరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version