ఏపీ సీఎం జగన్ కు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. చేనేత రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని చేనేత కార్మికులందరికీ నేతన్న నేస్తం అమలు చెయ్యడంతో పాటు టిడిపి హయాంలో అమలైన సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభించాలంటూ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు నారా లోకేష్.
చేనేత రంగంలో నిమగ్నమైన ప్రతి వృత్తి నేత కార్మికుడితో సహా స్పిన్నర్లు మరియు ఇతర కార్మికులకు ‘నేతన్న నేస్తం’ కింద రూ.24000 తప్పనిసరిగా ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాలు, మాస్టర్ వీవర్ల కింద పనిచేస్తున్న 3 లక్షల కుటుంబాలను నేతన్న నేస్తం కింద చేర్చాలని కోరారు. పథకం కింద అర్హత నిబంధనలను “సొంత మగ్గంతో నేత” నుండి “నేత”గా మార్చాలి. క్లిష్ట సమయాల్లో చేనేత పరిశ్రమను ప్రోత్సహించడానికి ఒక్కొక్కరికి రూ. 1.5 లక్షల సబ్సిడీ రుణాన్ని అందించాలని డిమాండ్ చేశారు నారా లోకేష్.