సీఎం జగన్ కు నారా లోకేష్ మరో లేఖ

-

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి.. నారా లోకేష్‌ బహిరంగ లేఖ రాశారు. ఎనర్జీ అసిస్టెంట్లు/జే ఎల్ ఎమ్ గ్రేడ్-II ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై త‌క్ష‌ణ‌మే స్పందించి ప‌రిష్క‌రించాల‌ని సిఎం జగన్ రెడ్డికి లేఖ రాశారు లోకేష్‌. స‌చివాల‌యాల్లో వుండి ప‌నిచేయాల్సిన‌ ఎనర్జీ అసిస్టెంట్లు/జే ఎల్ ఎమ్ గ్రేడ్-II ఉద్యోగుల‌ని విద్యుత్‌శాఖకి అండ‌ర్ టేకింగ్ చేశారు. జాబ్‌చార్ట్‌ని విస్మ‌రించి క‌ట్టుబానిస‌ల్లా వాడుకోవ‌డంతో వీరంతా తీవ్ర మాన‌సిక ఆందోళ‌న‌లో వున్నారని ఇందులో పేర్కొన్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ విద్యుత్ ప్ర‌మాదాల‌లో 89 మంది మ‌ర‌ణించారు. 200 మందికి పైగా తీవ్ర గాయాల పాల‌య్యారు. ఇప్ప‌టికైనా స్పందించి 7329 మంది ఎనర్జీ అసిస్టెంట్లు/జే ఎల్ ఎమ్ గ్రేడ్-II ఉద్యోగుల సమస్యలు త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించాలని, వారి డిమాండ్లు నెర‌వేర్చాల‌ని ఈ లేఖ ద్వారా కోరాను. వీరంద‌రినీ విద్యుత్‌శాఖ‌లోకి తీసుకోవాలి. విద్యుత్‌శాఖ‌లో జీత‌భ‌త్యాలు అమ‌లు చేయాలని డిమాండ్ చేశారు.

విధినిర్వ‌హ‌ణ‌లో చ‌నిపోయిన/గాయ‌ప‌డిన వారికి విద్యుత్‌శాఖ ఉద్యోగుల మాదిరిగానే ప‌రిహారం, కుటుంబంలో ఒక‌రికి ఉద్యోగం, మెడిక‌ల్ అల‌వెన్సులు ఇవ్వాలి. లేదంటే పూర్తిగా స‌చివాల‌యాల్లో నిర్దేశించిన ప‌నిగంట‌లకే విధులు నిర్వ‌ర్తించుకునే అవ‌కాశం క‌ల్పించాలని డిమాండ్‌ చేశారు లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version