అమరావతిని వరల్డ్ క్లాస్ AI రాజధానిగా తీర్చిదిద్దబోతున్నామని ప్రకటించారు మంత్రి నారా లోకేష్. గతంలో చంద్రబాబు సైబరాబాద్ ను అభివృద్ధి చేసి ప్రపంచపటంలో నిలిపారని తెలిపారు. అమరావతిని గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామని ప్రకటించారు నారా లోకేష్. రైతుల భాగస్వామ్యంతో వరల్డ్ క్లాస్ సిటీగా తయారుచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఎస్ఆర్ఎం, వీఐటీ వంటి సంస్థలు ఇప్పటికే ఆ ప్రాంతంలో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని వెల్లడించారు నారా లోకేష్.
ఏపీలో 2029 నాటికి 72 గిగావాట్స్ రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి మా లక్ష్యమని ప్రకటించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా ప్రభుత్వ విధానం అన్నారు. ఏపిలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన ఎకోసిస్టమ్ కల్పిస్తున్నామని ప్రకటించారు. రెన్యువబుల్ ఎనర్జీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, మెడికల్ డివైజ్, పెట్రో కెమికల్, ఫార్మా రంగాలకు పెద్దపీట వేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరుతున్నానని.. ఏపీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని ఘన విజయాన్ని ప్రజలు మాకు ఇచ్చారని తెలిపారు. వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు.