ఏపీలోని సత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై జరిగిన సామూహిక అత్యాచారం కేసును స్పెషల్ కోర్టుకు అప్పగిస్తామని హోంమంత్రి అనిత వెల్లడించారు. ఈ కేసులో నిందితులను 48 గంటల్లో గుర్తించామని ఆమె తెలిపారు.నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారని, ఒక వ్యక్తిపై ఏకంగా 30కు పైగా కేసులు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో మహిళల భద్రతపై అస్సలు రాజీపడబోమని, నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని షాపులు, ప్రైవేట్ సంస్థలను హోంమంత్రి అనిత ఆదేశించారు.
ఇదిలాఉండగా, బతుకుదెరువు కోసం కర్ణాటక నుంచి సత్యసాయి జిల్లాకు వచ్చి ఒంటరిగా ఉంటున్న అత్తాకోడళ్లపై వాచ్‌మెన్ అతని కొడుకుతో పాటు మరో ఐదుగురు దుండగులు వారిపై అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఏపీలో ఒక్కసారిగా సంచలనం రేపింది. నిందితులు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు.