నువ్వు ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్ బ్రదర్ అంటూ సీఎం జగన్ పై నారా లోకేష్ సెటైర్లు పేల్చారు. కక్ష సాధింపు కి మానవ రూపం జగన్ అని… పిచ్చి కి లండన్ మందులు వాడుతున్నట్టేనని చురకలు అంటించారు. కక్ష సాధింపు తగ్గడానికి ఏ అమెరికా మందులో వాడితే మంచిది. జగన్ తెచ్చిన పిచ్చి మందుకి 35 లక్షల మంది వివిధ రోగాల బారిన పడ్డారని ఆగ్రహించారు నారా లోకేష్. 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
మద్యపాన నిషేధం పేరుతో లక్ష కోట్ల ప్రజాధనం లూటీ చేసిన జగన్ చంద్రబాబు గారి పై కేసు పెట్టడం వింతగా ఉందన్నారు. ఆరోగ్యం పాడైన ప్రతి ఒక్కరూ జగన్ మీద కేసు పెడితే 35 లక్షలు కేసులు పెట్టొచ్చు అన్నారు. జగన్ నీకో చిన్న జే బ్రాండ్ ఛాలెంజ్.. రాష్ట్రంలో నువ్వు పెట్టిన ఏ లిక్కర్ షాపు ముందైనా నేను చర్చకు రెడీ అని సవాల్ చేశారు. ఎవరి హయాంలో లిక్కర్ దందా జరుగుతుందో తేల్చుకుందాం సిద్ధమా? అని నిలదీశారు. నిన్ను మందు బాబులు తిడుతున్న తిట్లు వినే ధైర్యం ఉంటే టైం అండ్ డేట్ ఫిక్స్ చెయ్యి. కక్ష సాధింపు లో నువ్వు ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్ బ్రదర్ అంటూ మండిపడ్డారు.