ఢిల్లీలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే – సీఎం చంద్రబాబు

-

విశాఖ పర్యటనకు విచ్చేసిన ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు అరకు కాఫీని బహుకరించారు. ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో జరుగుతున్న బహిరంగ సభలో మొదట ప్రధానిని సీఎం, డిప్యూటీ సీఎం శాలువాతో సత్కరించారు. అనంతరం శేషశయనుడి విగ్రహం, అరకు కాఫీని బహూకరించారు. ఆ తర్వాత బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ ప్రభుత్వం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రధాని మోడీపై ప్రజలకు ఉన్న విశ్వాసమే దానికి ప్రధాన కారణం అని చెప్పుకొచ్చారు. ఇంతకుముందు జరిగిన ఎన్నికలను చూస్తే ఇదే అర్థమవుతుందని.. భవిష్యత్తులోనూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కొనసాగుతుందని అన్నారు చంద్రబాబు. అలాగే కేంద్రంలోనూ మోడీయే ప్రధానమంత్రిగా ఉంటారని జోష్యం చెప్పారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 2029 నాటికి భారతదేశ మూడవ స్థానంలో, 2047 సంవత్సరానికి మొదటి స్థానానికి వస్తుందని పేర్కొన్నారు. మోడీ అంటే ఓ విశ్వాసం అన్నారు చంద్రబాబు. ఎన్నికలైన తర్వాత మొదటిసారి మోడీ ఏపీకి వచ్చారని.. వచ్చిన వెంటనే ఎన్నో పెట్టుబడులని అందించారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news