ఏపీలో కొత్త పథకం.. ఒక్కో కుటుంబానికి 25 లక్షల బీమా!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. తాజాగా ఏపీ ప్రభుత్వం.. బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్… ఇవాళ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా… ఈ ఏడాది నుంచి కొత్త పథకం అమలులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటన చేశారు మంత్రి పయ్యావుల కేశవ్.

New scheme in AP 25 lakh insurance for each family

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు 25 లక్షల ఆరోగ్య భీమా పథకాన్ని… అమల్లోకి తీసుకు వస్తున్నట్లు వెల్లడించారు మంత్రి పయ్యావుల కేశవ్. దీనివల్ల మధ్యతరగతి అలాగే పేద ప్రజలు ఎలాంటి.. ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం చేయించుకోవచ్చని తెలిపారు. అంతేకాదు ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో ఆరోగ్య శాఖ కోసం 19264 కోట్లు కేటాయించింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news