తిరుపతిలో కొత్త బస్టాండ్ ఏర్పాటు కానుంది.. ఈ మేరకు బస్టాండ్ లో పర్యటించింది ఎన్ హెచ్ ఎల్ ఎం కమిటీ. కమిటీ సీఈఓ ప్రకాష్ గౌర్, ప్రాజెక్టు డైరెక్టర్ పూజా మిశ్రా తో కలిసి ఎంపి గురుమూర్తి పర్యటించారు. బస్టాండ్ ఆవరణలో పర్యటించి పలు అంశాలను వివరించారు ఎంపి గురుమూర్తి. ఈ సందర్భంగా ఎంపి గురుమూర్తి మాట్లాడుతూ…బస్టాండ్ ను అధునాతనంగా రూపొందించనున్నారు…. కొత్త బస్టాండ్ నిర్మాణానికి మాజీ సిఎం జగన్ కారకులు అన్నారు.
ఎన్ హెచ్ సీఈఓ ప్రకాష్ గౌర్ మాట్లాడుతూ…నూతన బస్టాండ్ డిజైన్స్ పై త్వరలో సిఎం చంద్రబాబు కు ప్రజెంటేషన్ ఇవ్వనున్నామని.. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. మూడేళ్లలో నూతన బస్టాండ్ ను పూర్తి చేస్తామని చెప్పారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తామన్నారు. ప్రయాణికులనే కాదు భక్తులను దృష్టిలో ఉంచుకుని బస్టాండ్ నిర్మాణం అన్నారు. భక్తులు సేదతీరేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని… ఫుడ్ కోర్టు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్ తదితర ఏర్పాట్లు నూతన టెర్మినల్ భవనంలో ఉంటాయని చెప్పారు.