హైడ్రా తో రాజకీయ కుట్ర అని… బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్ అంటూ హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అన్ని అనుమతులు ఉన్నా.. అక్రమం కాకున్నా.. అక్రమం అంటూ టార్గెట్ చేసి కూల్చివేతలకు పాల్పడుతున్నట్లు మండిపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం… రాజకీయ కక్షకు విద్యాసంస్థలు టార్గెట్ కాకూడదని కోరారు మాజీ మంత్రి హరీష్ రావు.
రాజకీయంగా ఎదుర్కోలేక పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 36 శాతం డెంగ్యూ కేసులు పెరిగాయని.. డెంగ్యూ కేసులపై రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సమీక్ష కూడా చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు లేవని.. ప్రజల ఆరోగ్యం కంటే ఏదైనా ముఖ్యమైనది ఉందా? అని నిలదీశారు. రాష్ట్రంలో పారిశుద్ధ్య అస్తవ్యస్తంగా మారిందని.. రాష్ట్రంలో ‘హెల్త్ ఎమర్జెన్సీ’ పరిస్థితి ఉందని.. అది పట్టించుకోకుండా రాజకీయ బుల్లింగ్కు ప్రభుత్వం పాల్పడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. డెంగ్యూపై సమీక్ష చేయకుండా.. విపక్షాలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు.