ఏపీ అప్పులు 14 లక్షల కోట్లు – మంత్రి నిమ్మల సంచలనం

-

ఏపీ అప్పులు 14 లక్షల కోట్లు ఉందని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సమ్మర్ స్టోరేజిని పరిశీలించారు నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ సందర్భంగా నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… హంద్రీనీవా దుస్థితికి కారణం వైసీపీ ప్రభుత్వమేనని తెలిపారు.

nimmala ramanaidu on ap debts

5 శాతం పనులు కూడా పూర్తి చేయకుండానే సంపదను జగన్ ప్రభుత్వం కొల్లగొట్టేసిందన్నారు. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని వెల్లడించారు. చంద్రబాబుపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని వెల్లడించారు. పద నాలుగు లక్షలకోట్లు అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెత్తిమీద ఉంది. 2014 లో రాష్ట్ర విభజనకన్నా 2019-24 జగన్ పాలన వాళ్లే రాష్టానికి ఎక్కవ నష్టం జరిగిందని పేర్కొన్నారు నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version