మారేడుమిల్లిలో ఐదుగురు విద్యార్థులు మృతి.. ఏడుగురి కోసం గాలింపు!

-

రాజమండ్రిలోని మారేడుమిల్లిలో ముగ్గురు మెడికల్ విద్యార్థులు, ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు నీట మునిగి మృతిచెందిన విషయం తెలిసిందే.అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగదీష్ అడహల్లి కథనం ప్రకారం..టూర్‌లో భాగంగా ఏలూరు ఆశ్రమ వైద్య కళాశాలకు చెందిన 14 మంది మెడికోలు ఆదివారం మారేడుమిల్లిని సందర్శించి జలతరంగిణి వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లారు.అందులో ముగ్గురు వైద్య విద్యార్థులు సీహెచ్ హరదీప్, కే సౌమ్య, బీ అమృత‌లతో పాటు ఇద్దరు బీటెక్ విద్యార్థినులు సైతం వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. మరో ముగ్గురు మెడికల్ స్టూడెంట్స్ హరిణి ప్రియ, బొట్నూరి ప్రజ్ఞ, గాయత్రి పుష్పలను రక్షించి ఆస్పత్రికి తరలించారు.

అయితే, జలపాతం వద్ద మిగిలిన ఏడుగురిని కాపాడే పనిలో భాగంగా NDRF బృందాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు ASP తెలిపారు.దట్టమైన అడవి ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందన్నారు.కాగా, రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి ఆస్పత్రిని సందర్శించి ఇద్దరు వైద్యాధికారులతో మాట్లాడారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version