ప్ర‌కాశం బ్యారేజ్ గేట్ల‌లో ఉన్న ప‌డ‌వ‌లు వైసీపీ వారివే – మంత్రి నిమ్మల

-

ప్ర‌కాశం బ్యారేజ్ గేట్ల‌లో ఉన్న ప‌డ‌వ‌లు వైసీపీ వారివే అంటూ బాంబ్‌ పేల్చారు మంత్రి నిమ్మల రామా నాయుడు. వరద పీక్ టైంలో 11.40 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినప్పుడు 5 పడవలు వచ్చి ఢీ కొన్నాయి…దీని వెనుక కుట్ర దాగి ఉందనే ఆనుమానం ఉందని వెల్లడించారు. అదృష్టవశాత్తూ మెయిన్ కట్టడాలను బోట్లు తాకలేదన్నారు మంత్రి నిమ్మల రామా నాయుడు. గేట్లను, కట్టడాలను తాకితే ఐదారు జిల్లాలు ఎంతో నష్టపోయేవని చెప్పారు మంత్రి నిమ్మల రామా నాయుడు.

nimmala ramanaidu on prakasam barrage

ఇరిగేషన్ శాఖ నుంచి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు వేగంగా జరుగుతోందని…ఒకే యజమానికి చెందినవి ఈ పడవలు అంటూ ఆరోపణలు చేశారు. పడవల ఓనర్ ఉషాద్రి తలశిల రఘురాంకు అనుచరుడన్నారు. నందిగం సురేష్ కనుసన్నల్లో నదుల్లో అక్రమంగా ఆరోజు డ్రెజ్జింగ్ చేసి ఇసుక తీసారని పేర్కొన్నారు మంత్రి నిమ్మల రామా నాయుడు.. ఈ పడవల ద్వారానే ఇసుక లూటీ చేశారని వెల్లడించారు. ఆ పడవలకు వైసీపీ కలర్ కూడా వేసి మరీ ఇసుక తవ్వుకున్నారని చెప్పారు మంత్రి నిమ్మల రామా నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version