నిమ్మల రామానాయుడు: నిన్న కాళ్లు కడిగాడు…ఇవాళ స్కూటర్ ఎక్కాడు !

-

జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు రోజుకో వార్తతో వైరల్‌ అవుతున్నారు. నిన్న ఓ వృద్ధురాలి కాళ్లు కడిగి… పెన్షన్‌ ఇచ్చారు నిమ్మల. అలాగే.. ఇవాళ ఓ వృద్ధుడిని బైక్‌ పైన ఎక్కించుకుని.. పెన్షన్‌ ఇప్పించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌ గా మారింది. ఇక ఈ సందర్భంగా జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… రాజకీయ లబ్ది కోసం వాలంటరీ వ్యవస్థ లెకపొతే పింఛను పంపిణీ జరగదని వైసీపీ అసత్య ప్రచారం కు టీడీపీ ప్రభుత్వం స్వస్తి పలికిందని.. పింఛన్లు కోసం ఎండల్లో తిరిగి చనిపోయిన 34 మంది మరణానికి జగన్ మోహనరెడ్డి కారణం అయ్యారన్నారు.

nimmala

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రలో జులై 1 వ తేదీ చారిత్రకమైన రోజు అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పెంచిన పింఛన్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు అందించారని తెలిపారు. పెంచిన పింఛన్లు లబ్దిదార్లకు అందిస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం ను చూసామని… గత ప్రభుత్వంలో జగన్ కనీసం దివ్యాంగులకు ఒక్క రూపాయి పింఛన్ పెంచలేదని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఖాజానా ఖాళీ చేసి 12.50లక్షల కోట్లు అప్పు మిగిల్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 4400 కోట్లు పింఛన్ అందించారని తెలిపారు.

https://x.com/ChotaNewsTelugu/status/1807989049283494177

Read more RELATED
Recommended to you

Exit mobile version