పిఠాపురం ప్రజలకు పవన్ కల్యాణ్ గుడ్‌న్యూస్

-

పిఠాపురం ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్‌న్యూస్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ తొలిసారి పిఠాపురంలో పర్యటించారు. పిఠాపురంలో పవన్‌ అడుగుపెట్టడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. పిఠాపురంలో స్థలం కోసం చూస్తున్నానని.. ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పారు.

Pawan Kalyan is good news for the people of Pithapuram

ఎన్నికలకు ముందు చేబ్రోలులో ఓ ఇంటిని పార్టీ కార్యకలాపాల కోసం పవన్‌ అద్దెకు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. ఏపీలో అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఉంటాయన్నారు. విలువలు ఉన్న మనిషి డొక్కా సీతమ్మ అని.. అందుకే ఆమెకు గుర్తుగా ఏపీలో అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఉంటాయన్నారు. ప్రతిపక్షం లేదని అనుకోవద్దు సమస్య వచ్చినప్పుడు మనమే ప్రతిపక్ష పాత్ర పోషించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version