నాలుగు గోడల మధ్య కాదు.. బయట కూడా బైబిల్ చదువుకోవచ్చు అని సీఎం చంద్రబాబు జగన్ కి సెటైర్లు వేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ చేసిన కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం జగన్ నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతాను. హిందు దేవాలయాలకు వెళ్థాను. ముస్లిం మందిరాలకు వెళ్తారు. సిక్కుల గురుద్వారానికి వెళ్తానని చెప్పాడు. దీనికి వెరీ గుడ్ జగన్ అన్నీ మతాలను గౌరవిస్తానన్నందుకు. కానీ తిరుమల నిబంధనలను ఎందుకు ధిక్కరిస్తున్నావని ప్రశ్నించారు.
ఇంతకు ముందు వెళ్లాను.. ఇప్పుడు ఎందుకు వెళ్లకూడదని అడుగుతున్ననారు. మీరు వెళ్లండి. దేవుడు, ఆచారాల కంటే ఏ వ్యక్తి గొప్ప కాదు. తిరుమలకు వెళ్లకుండా ఉండటానికి జగన్ కి ఏ సాకులు ఉన్నాయో తెలియదు. తిరుమల లాంటి పుణ్యక్షేత్రం ఉండటం మన తెలుగు వారి అదృష్టం అన్నారు. ఆలయాల సంప్రదాయాన్ని అందరూ గౌరవించాలి. నేను చర్చి కి వెళ్తాను.. మసీదుకు వెళ్తాను. అక్కడి మత ఆచారాలను గౌరవిస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు.