తిరుమలకు జగన్ ను వెళ్లొద్దని ఎవ్వరూ చెప్పలేదు అని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేవుడు, ఆచారాల కంటే ఏ వ్యక్తి గొప్ప కాదు. తిరుమలకు వెళ్లకుండా ఉండటానికి జగన్ కి ఏ సాకులు ఉన్నాయో తెలియదు. తిరుమల లాంటి పుణ్యక్షేత్రం ఉండటం మన తెలుగు వారి అదృష్టం అన్నారు. ఇంతకు ముందు వెళ్లాను.. ఇప్పుడు ఎందుకు వెళ్లకూడదని అంటున్ననారు. జగన్ ఇంతకు ముందు తిరుమల నిబంధనలను ధిక్కరించారని తెలిపారు.
గతంలో చాలా మంది డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్లారు. అన్ని మతాలను గౌరవించే జగన్ తిరుమల నిబంధనలను ఎందుకు పాటించరని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. నెయ్యి కల్తీనే జరగలేదని జగన్ అంటాడు. ఈవో చెప్పాడు అంటారు. ఏ.ఆర్. కంపెనీ నుంచి మొత్తం 8 ట్యాంకర్లు వస్తే.. 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేసినట్టు తెలిపారు. NDDB ఇచ్చిన రిపోర్ట్ ని బయటపెట్టకపోతే తప్పు చేసినట్టు కాదా..? అని ప్రశ్నించారు. చెప్పిన అబద్దాన్ని జగన్ మళ్లీ మళ్లీ చెబుతున్నారు.