ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. ఏపీకి మోచా ముప్పు తప్పింది. దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండం ఏర్పడింది. పోర్టు బ్లయిర్‌కు 510కి.మీ దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతం అయిందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ సాయంత్రానికి మోచా తుఫానుగా బలపడనుంది ఈ వాయుగుండం.
అటు అండమాన్ తీరంలో బలంగా వీస్తున్నాయి ఈదురుగాలులు. ఈ తరుణంలోనే ఏపీ తీరానికి మోచా ముప్పు లేదని ప్రకటించింది వాతావరణ శాఖ. ఇక అటు..ఇక అటు తెలంగాణలో ఇవాళ్టి నుంచి భారీగా ఎండలు ఉండనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వానలు తక్కువ ముఖం పట్టాయి. రెండు వారాలుగా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తుండటంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చల్లటి వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వాతావరణంలో మార్పు చోటుచేసుకుంది. తెలంగాణలో ఇవాళ్టి నుంచి భారీగా ఎండలు ఉండనున్నాయి. దీంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.