తెలంగాణలో ఇవాళ్టి నుంచి భారీగా ఎండలు ఉండనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వానలు తక్కువ ముఖం పట్టాయి. రెండు వారాలుగా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తుండటంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చల్లటి వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వాతావరణంలో మార్పు చోటుచేసుకుంది.
ఎండల తీవ్రత పెరిగింది. ఆదివారం వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా… సోమవారం అన్ని జిల్లాల్లో 35 డిగ్రీలు దాటి 40 డిగ్రీలకు చేరువయ్యాయి. అదిలాబాద్ లో అత్యధికంగా 39.8°, భద్రాచలం-కొత్తగూడెంలో,38, హనుమకొండలో 37.5, హైదరాబాదులో 36.3, ఖమ్మంలో 38.6, మహబూబ్నగర్ లో 35.4, మెదక్ లో 37.6, నల్లగొండలో 39, నిజామాబాద్ లో 38.4, రామగుండంలో 39.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలో ఇవాళ్టి నుంచి భారీగా ఎండలు ఉండనున్నాయి. దీంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.