ఏపీ ప్రజలకు ఆరోగ్య శాఖ మంత్రి రజిని శుభవార్త చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ఇప్పటివరకు 1.8 కోట్లమైంది వైద్య సేవలు పొందారని మంత్రి విడదల రజిని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ గ్రామానికి వచ్చే ముందురోజే ఊరిలో చాటింపు వేయించాలని అధికారులకు సూచించారు.
ఏపీ వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి NSD సర్వే చేపడతామని మంత్రి తెలిపారు. దీనివల్ల కొత్త కేసులు ఏమైనా బయటపడితే చర్యలు తీసుకోవడానికిఅవకాశం కుదురుతుందని వెల్లడించారు. కాగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. వెయ్యి కోట్లు రుణం తీసుకుంది. మంగళవారం రిజర్వు బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని… 12 ఏళ్ల కాల పరిమితితో తిరిగి చెల్లించేలా 7.43% వడ్డీతో రూ. 1,000 కోట్ల మొత్తాన్ని తీసుకుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న బహిరంగ మార్కెట్ రుణం రుణం రూ. 29,500 కోట్లకు చేరింది.