ఏపీలో నేడు 2,941 ప‌రీక్షల్లో ఒక్క పాజిటివ్ కేసు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి సాధ‌ర‌ణ ప‌రిస్థితికి చేరుకుంటుంది. కేసుల సంఖ్య భారీగా త‌గ్గుతున్నాయి. గ‌త కొద్ది రోజుల నుంచి సింగిల్ డిజ‌ట్ లోనే కేసులు వెలుగు చూస్తున్నాయి. అందులోనే కొన్ని రోజుల్లో ఒక్క పాజిటివ్ కేసు మాత్ర‌మే న‌మోదు అవుతుంది. ఈ రోజు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర క‌రోనా వైర‌స్ బులిటెన్ ను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేశారు.

ఈ క‌రోనా బులిటెన్ ప్ర‌కారం… గ‌డిచిన 24 గంట‌ల్లో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య మంత్రుత్వ‌ శాఖ అధికారులు 2,941 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు చేశారు. ఈ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షల ఫ‌లితాల్లో కేవ‌లం ఒక్క పాజిటివ్ కేసు మాత్ర‌మే న‌మోదు అయింది. విశాఖ ప‌ట్నం జిల్లాలో ఈ పాజిటివ్ కేసు వెల‌గు చూసింది. కాగ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా న‌లుగురు క‌రోనా వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. అలాగే ఈ రోజు కూడా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version