తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ షాక్ తగిలింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో నీటి సరఫరా బంద్ కానుంది. వర్షాకాలంలో టీటీడీ విచిత్ర నిర్ణయం తీసుకుంది. తిరుమలలో నీటి సరఫరా పై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది టీటీడీ పాలక మండలి. స్థానికులు నివాసం వుండే బాలాజీనగర్ లో 6 రోజులుకు ఒక్కసారి నీటి సరఫరా చేయనున్నారు.
వ్యాపార ప్రదేశాలుకు రోజుకు 8 గంటల పాటు మాత్రమే నీటి సరఫరా చేస్తున్నారు. దాతలు నిర్మించే అతిధి భవనాలకు పూర్తిగా నీటి సరఫరా బంద్ కానున్నాయి. తిరుపతి నుంచి ట్యాంకర్లు ద్వారా నీటిని తెప్పించుకోవాలని సూచించింది టిటిడి పాలక మండలి. డ్యాంలో నీటి నిల్వలు వున్నా….వర్షాలు కురుస్తూన్నా నీటి సరఫరా పై ఆంక్షలు విధించడం పై అందరూ భక్తులు విస్మయం చెందుతున్నారు. మరి దీనిపై భక్తులు ఎలా స్పందిస్తారో చూడాలి.