ఉచితంగా ల్యాప్‌టాప్‌లు… ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్

-

అమ్మ ఒడి, నాడు నేడు, విద్యా దీవెన, విద్యాకానుక లాంటి పథకాలతో ఏపీ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుంది. ఇందులో భాగంగా అమ్మ ఒడి పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌(laptop)లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెల్సిందే. 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.

ల్యాప్‌టాప్‌ /laptop

అమ్మఒడి పథకం కింద ఇస్తున్న నగదును వద్దనుకున్న వారికే ల్యాప్ టాప్ లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించే ప్రక్రియలో భాగంగా ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. ల్యాప్‌టాప్‌ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ ఈ ఉత్తర్వులు జారీ చేసారు.

డ్యుయెల్‌ కోర్‌ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్‌ డిస్క్, 14 ఇంచ్‌ల స్క్రీన్, విండోస్‌ 10 (ఎస్టీఎఫ్‌ మైక్రోసాఫ్ట్‌), ఓపెన్‌ ఆఫీస్‌ (ఎక్సెల్, వర్డ్, పవర్‌ పాయింట్‌)ల కాన్ఫిగరేషన్‌తో ల్యాప్‌టాప్‌లు అందించనున్నారు. ల్యాప్‌టాప్‌లకు మూడేళ్ల వారెంటీ ఉండాలని పేర్కొంటూ టెండర్లు పిలిచే బాధ్యతను ఏపీటీఎస్ కు అప్పగించనున్నారు. ల్యాప్‌టాప్‌లకు మెయిన్‌టెనెన్స్‌ సమస్యలు ఎదురైతే ఫిర్యాదు ఇచ్చిన వారంలోపు పరిష్కరించేలా సదరు కంపెనీకి షరతు విధిస్తున్నారు. ఏవైనా సమస్యలు వస్తే విద్యార్థులు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version