ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. సీఎంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు కొనసాగుతున్నారు. అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థ, మత్స్యశాఖలను కేటాయించడంతో ఈ బాధ్యతలు అచ్చెన్నాయుడు చూసుకోనున్నారు.
పార్టీ బాధ్యతలను నూతనంగా ఎంపికైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చూసుకోనున్నట్టు తెలుస్తోంది. అచ్చెన్నాయుడు స్థానంలో పల్లా శ్రీనివాస్ కి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవీ దక్కినట్టు సమాచారం. దీనిపై టీడీపీ అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు 95,235 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.