కొడుకు హిజ్రాను ప్రేమించాడని తల్లిదండ్రులు ఆత్మహత్య..!

-

సాధారణంగా తమ కుమారుడు పెళ్లి చేసుకున్నాడంటే ఏ తల్లి దండ్రులు అయినా సంతోషంగా ఉంటారు. కానీ కొందరూ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా వారికి నచ్చకపోతే తమ కూతురు లేదా కుమారుడిని మందలిస్తారు. ఆగ్రహానికి గురై.. తమ అల్లుడిని అంతం చేసేందుకు కూడా వెనుకాడరు అమ్మాయి తల్లిదండ్రులు. కానీ ఇక్కడ తల్లిదండ్రులే తమ కుమారుడు చేసిన పనికి ఆత్మహత్య చేసుకున్నారు.

తమ కొడుకు హిజ్రాను ప్రేమించాడని తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. నంద్యాల – సుబ్బరాయుడు, సరస్వతి దంపతుల కొడుకు సునీల్ బీటెక్ ఫస్టియర్ ఫెయిల్ అయి ఆటో డ్రైవర్లతో తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే ఓ హిజ్రాతో కొడుకు ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని తెలిసి తల్లిదండ్రులు అతడిని మందలించారు. అయితే హిజ్రా గ్యాంగ్ వారి షాపు వద్దకు వచ్చి బూతులు తిడుతూ హంగామా చేశారు. దీంతో అవమానం తట్టుకోలేక సుబ్బారాయుడు-సరస్వతి పురుగుల మందు తాగి చనిపోయారు. ఈ ఘటన పై కుమారుడి పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news