ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేస్తా..ఒక్కసారి జనసేనను చూడండి – పవన్ కళ్యాణ్

-

ఏ రాయలసీమ ముఖ్యమంత్రి చేయని విధంగా రాయలసీమను అభివృద్ధి చేస్తానని..ఒక్కసారి జనసేనను చూడండని కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజకీయాల్లోకి సరదాకోసం రాలేదు.. మార్పు కోసం వచ్చానని పేర్కొన్నారు. తనకు అందరూ సమానమేనని వెల్లడించారు పవన్‌ కళ్యాణ్‌. ఒకే ఒక్కసారి జనసేన వైపు చూసి.. తమను ఆశీర్వదించండని కోరారు.

చిరంజీవిని పిలిచి మరీ..అవమానించారని సీఎం జగన్‌ పై పవన్‌ కళ్యాణ్‌ సీరియస్‌ అయ్యారు. ఆత్మగౌరవం చంపుకొని నేను ఎప్పుడూ ఏ పని చేయనని.. మెగాస్టార్ గా పిలుచుకునే చిరంజీవి సీఎం జగన్ అహంభావానికి గురైన వారేనని మండిపడ్డారు.

చిరంజీవి లాంటి వ్యక్తి నమస్కారంపెడితే కనీసం నమస్కారం కూడా పెట్టని వ్యక్తి జగన్ అని ఫైర్ అయ్యారు. మరి అలాంటి వ్యక్తి సామాన్యులకు ఎలాంటి గౌరవం ఇస్తాడో ప్రజలే అర్థం చేసుకోవాలని… కష్టపడి బతకడానికి కూడా మీకు నమస్కారాలు పెట్టాలి అంటే మా ఆత్మగౌరవం ఒప్పుకోవడం లేదని ఓ రేంజ్‌ లోనిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version