విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందన

-

విశాఖలోని ఫిషింగ్‌ హార్బర్‌లో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఓ బోటులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే వ్యాపించడంతో పక్కనే ఉన్న 40 బోట్లు దగ్ధమయ్యాయి. వీటి విలువ దాదాపు రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుందని బోటు యజమానులు చెబుతున్నారు. తాము నష్టపోయాని.. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

తాజాగా ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన దురదృష్టకరమని అన్నారు. ఈ ప్రమాదం వల్ల నష్టపోయిన బోట్ల యజమానులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులకు జీవన భృతి అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి భద్రతాపరమైన అంశాలపై సమీక్షించాలని కోరిన పవన్ కల్యాణ్.. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news