తమ్ముడు పవన్ కళ్యాణ్ బిజెపిని వదిలి బయటకి రావాలి – కేఏ పాల్

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపిని వదిలి బయటకు రావాలని అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ తో కలిసి విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ్ముడు పవన్ కళ్యాణ్ బిజెపిని వదిలి బయటకు రావాలని.. జనసేన పార్టీని ప్రజాశాంతి పార్టీలో కలపాలని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడడం కోసం తన ఆస్తులను కూడా అమ్ముతారని అన్నారు కేఏ పాల్.

తనకి ప్రాణహాని ఉందని.. తనని అరెస్టు చేయాలని కూడా చూస్తున్నారని చెప్పారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కు తెలంగాణ ప్రభుత్వం తరఫున బిడ్డింగ్ వేస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. సొంత రాష్ట్రం తెలంగాణను కూడా కాపాడుకోలేని కేసీఆర్.. నీవు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడతావా..? అంటూ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని విమర్శించారు. వైసీపీ నుంచి అంతమంది ఎంపీలు ఉన్న స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం జగన్ ఏం చేశారని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version