నాగబాబుకు మంత్రి పదవి రావడంపై కూడా పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ చిట్ చాట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నాగబాబును రాజ్యసభ నుంచీ రీకాల్ చేసాను.. నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వాలని నా ఉద్దేశం అన్నారు. జనసేన ఇప్పుడే పుడుతున్న పార్టీగా అనుకోవాలి..నాగబాబు విషయంలో అడుగుతారని తెలిపారు. జగన్ విషయంలో ఎవరూ అడగరు…వారసత్వ రాజకీయాలు అని అనడం లేదన్నారు.
నాగబాబు ను ఎమ్మెల్సీ చేసాక, మంత్రి ని చేసే విషయం ఆలోచిస్తారని పేర్కొన్నారు. రాజ్యసభను నాగబాబు త్యాగం చేసారు…కులం చూసి నేను మనుషులను ఎంచుకోలేదని తెలిపారు. పార్టీని నేను పట్టించుకునే సమయం దొరకడం లేదని… నేను నా కేడర్ ని కలవలేకపోతున్నా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. జనవరి 4 నుంచీ 14 నాటికి బాగా ప్రిపేర్ అవుతామని… జగన్ దగ్గర నుంచీ ఎలా భయపెట్టాలో నేర్చుకోవచ్చు పేర్కొన్నారు.