చంద్రబాబు అరెస్ట్ తో హరికృష్ణ ఆత్మకి శాంతి : అంబటి రాంబాబు

-

తెలుగుదేశం పార్టీకి పట్టిన శని నారా లోకేష్ అని.. చంద్రబాబు అరెస్ట్ తో నందమూరి హరికృష్ణ ఆత్మ కూడా శాంతిస్తోంది. రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు ఆరోగ్యంపై నాటకం ఆడుతున్నారని.. మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అంబటి రాంబాబు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్ తో కలత చెంది ఎవ్వరూ చనిపోలేదు. చంద్రబాబుకు జైలులో పటిష్ట భద్రత ఉంది. ఆధారాలతో సహా దొరికిపోయిన దొంగ చంద్రబాబు అన్నారు.

నారా భువనేశ్వరి నిజం గెలవాలి అనే పేరుతో యాత్ర చేయబోతున్నారట. వాస్తవానికి నిజం గెలవాలనే జనం కోరుకుంటున్నారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నిజాలను పాతాళంలోకి తొక్కేశారు. వ్యవస్థలను మ్యానేజ్ చేసేవారు. ఇప్పుడు నిజం గెలుస్తుందనే చంద్రబాబు జైలులో ఉన్నారు. నిజం గెలవాలని కోరుకునే వారు. 17 ఏ పట్టుకునే ఎందుకు తిరుగుతున్నారు..? వాస్తవాన్ని ఓడించాలనే మీ ప్రయత్నం ఓడిపోతూనే ఉంది. చంద్రబాబు జైలుకి వెళ్లిన తరువాత ఎన్టీఆర్, వంగవీటి రంగా, హరికృష్ణ, కందుకూరు, గుంటూరు సభల్లో చనిపోయిన వారి ఆత్మలు శాంతిస్తున్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version