ABC జ్యూస్‌ తాగితే A టూ Z అన్ని రోగాలు మాయం..! ఇలా చేసేయండి.!

-

స్కిన్ గ్లో రావాలంటే.. ఎక్కువగా ఫ్రూట్‌ జ్యూస్‌తాగాలి. దీనివల్ల చర్మం బాగుంటుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. బరువు తగ్గాలనుకునేవాళ్లు కూడా చాలా రకాల జ్యూస్‌లు తాగుతుంటారు. మీరు ఎప్పుడైనా ఏబీసీ జ్యూస్‌ గురించి విన్నారా..? ఇది తాగితే ఏ టూ జెడ్‌ అన్ని రోగాలు నయం అవుతాయి. ముఖ్యంగా బరువు తగ్గడానికి ఇది బెస్ట్‌గా పనిచేస్తుంది. ABC జ్యూస్ మీకు ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది. కాబట్టి బరువు తగ్గడానికి డైట్‌లో ఉండే వారికి ఈ జ్యూస్ సరిపోతుంది. అసలు ఏబీబీ జ్యూస్‌ అంటే ఏంటి..? ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.!

ABC జ్యూస్‌ ఎలా తయారు చేయాలి

ఏబీసీ జ్యూస్‌ అంటే.. యాపిల్‌, బీట్‌రూట్‌, క్యారెట్‌ జ్యూస్‌ అనమాట.! ముందుగా క్యారెట్, బీట్‌రూట్‌, యాపిల్ తీసుకోండి. బీట్‌రూట్‌, క్యారెట్‌లను చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. దీన్ని మిక్సీ జార్‌లో వేసి అందులో కొద్దిగా అల్లం, పంచదార వేసి బాగా గ్రైండ్‌ చేయండి. అందులోనే యాపిల్‌ కూడా వేయండి. చిన్న ముక్కలను వదిలివేయకుండా ఉండటానికి మీడియం చెంచా ఉపయోగించండి. తర్వాత దానిని వడకట్టి సగం నిమ్మకాయను పిండాలి. అవసరమైతే 2 పుదీనా ఆకులను కూడా వేయండి. అంతే ABC జ్యూస్ రెడీ. దీన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం మంచిది.

ABC జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

-ABC జ్యూస్‌లో విటమిన్లు A, C, D, E, ఇనుము, మెగ్నీషియం వంటి వివిధ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

-ఏబీసీ జ్యూస్ మిమ్మల్ని ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది. కాబట్టి బరువు తగ్గడానికి డైట్‌లో ఉండే వారికి ఈ జ్యూస్ సరిపోతుంది.

– నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.

-ఇది తాగడం వల్ల మీ చర్మం, జుట్టు సహజంగా మెరుస్తుంది.

-ABC రసం మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

-దీన్ని తాగడం వల్ల రోజంతా తాజాగా ఉంటుంది. అలసట అనిపించదు.

-ABC జ్యూస్ మన శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి అంటే మన శరీరం నుండి విషపూరిత మూలకాలను తొలగించడానికి సహాయపడుతుంది.

-శరీరంలో ఎర్ర రక్తకణాన్ని పెంచుతుంది.

-రక్తపోటును నియంత్రిస్తుంది.

– వాపును తగ్గిస్తుంది.

– జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

– మంచి జీర్ణక్రియ మరియు తక్కువ మలబద్ధకం.

Read more RELATED
Recommended to you

Exit mobile version