రాహుల్ గాంధీ బైక్ ర్యాలీలో అపశృతి.. కొండా సురేఖ ముఖానికి, చేతికి గాయాలు..!

-

కాంగ్రెస్ విజయ భేరీ బస్సు యాత్రలో భాగంగా మాజీ మంత్రి కొండా సురేఖకు తృటిలోనే పెద్ద ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ పాల్గొనడంతో భూపాలపల్లి పట్టణంలో కాంగ్రెస్ నేతలు బైకు ర్యాలీ నిర్వహించారు. భూపాలపల్లి పట్టణంలో బాంబుల గడ్డ వద్ద వరకు నిరుద్యోగులతో కలిసి బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

భూపాలపల్లిలో బైకు ర్యాలీలో పాల్గొన్న సురేఖ.. స్కూటీ నడుపుతూ కింద పడ్డారు. కొండా సురేఖ, ముఖానికి, చేతులకు గాయాలయ్యాయి. వెంటనే ఆమె అనుచరులు ఆమెను హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సురేఖ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉంది. కానీ మాత్రం పొరపాటు జరిగినా ఆమెకు పెద్ద ప్రమాదం జరిగేది. ఆ ర్యాలీలో స్కూటీ స్కిడ్ అయి కిందపడినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఒకేసారి వెనుక వైపు నుంచి వాహనాలు వచ్చి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదని స్పష్టం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version