ఏలూరు కలెక్టర్ , అధికారులపై పేర్ని నాని ఆగ్రహం

-

ఏలూరు కలెక్టర్ , అధికారులపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం RWS అధికారులపై తర్వాత ఏలూరు కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు పేర్ని నాని. ఏలూరు జిల్లా కలెక్టర్ ఏమన్నా నియంతా అంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి పేర్ని నాని.

జడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టరేట్ నుంచి గుమస్తా కూడా రావటం లేదని.. వ్యవస్థ అంటే భయం కాదు గౌరవం ఉండాలి కదా అంటూ ఫైర్‌ అయ్యారు. ఏలూరు జిల్లా కలెక్టర్ నియంత అనుకుంటు న్నారా.. ఏలూరు కలెక్టరేట్ అధికారుల తీరుపై తీర్మానం చేసి నిరసన తెలపాలన్నారు పేర్ని నాని. ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు అధికారులు రాకపోతే సమాధానం ఎవరు చెబుతారని తెలిపారు. వచ్చే సమావేశానికి కలెక్టర్ రాకపోతే సీఎం లేదా సిఎస్ కార్యాలయం దగ్గర నిరసన చేస్తామని తీర్మానం చేసి కలెక్టర్ కి పంపాలని కోరారు పేర్ని నాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version